హైదరాబాద్, వెలుగు: అమృత్ టెండర్ల విషయంలో బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్కేటీఆర్ ప్రస్తావిస్తున్న సుజన్‌రెడ్డి తన చిన్న అల్లుడు అని, ఆయనకు సీఎం రేవంత్‌రెడ్డికి సంబంధం లేదని బీఆర్ఎస్ నేత కందాల ఉపేందర్ రెడ్డి తెలిపారు. సుజన్ రెడ్డికి రాజకీయాలకు లింక్ లేదని చెప్పారు. ఈ మేరకు బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఉపేందర్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు.
అమృత్ టెండర్ల విషయంలో కేటీఆర్ అనవసరంగా వివాదం చేస్తున్నారని అన్నారు. ఈ విషయంలో ఆయనకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని, త్వరలోనే ఆయన్ను కలిసి అసలు విషయమేందో చెబుతానని తెలిపారు. బిజినెస్‌లో జాయింట్ వెంచర్లు సహజం అని, తన అల్లుడి కంపెనీ ‘శోధ’ కూడా పలు జాయింట్ వెంచర్లు చేస్తున్నదని చెప్పారు. అందులో భాగంగానే అమృత్ టెండర్లను దక్కించుకున్నదని తెలిపారు.