- బంజారాహిల్స్ పీఎస్లో ఫిర్యాదు చేసిన కార్తీక్ రెడ్డి
జూబ్లీహిల్స్,వెలుగు : అసెంబ్లీలో జరిగిన చర్చలో తెలుగు తల్లి ప్లైఓవర్ పేరును తీసేసి తెలంగాణ తల్లి ప్లైఓవర్గా నామకరణం చేయాలనే చర్చపై ఇటీవల కొందరు వ్యక్తులు తెలంగాణలో ' తె' అనే అక్షరాన్ని తొలగించి పేరు పెట్టుకోండి అంటూ ఓవ్యక్తి ట్వట్టర్లో పోస్టు చేశారు.
దానిపై మాజీ మంత్రి సబితా రెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను కించపరిచేలా పోస్టు చేశాడని అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ బంజారాహిల్స్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశాడు.