
- భూపాలపల్లి సీఐ నరేశ్‌కుమార్ గౌడ్ వెల్లడి
భూపాలపల్లి రూరల్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గత నెలలో హత్యకు గురైన సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో ప్రధాన నిందితుడైన బీఆర్ఎస్ నేత కొత్త హరిబాబును అరెస్టు చేశారు. మంగళవారం భూపాలపల్లి సీఐ నరేశ్‌కుమార్ గౌడ్మీడియాకు వివరాలు తెలిపారు. రాజలింగమూ ర్తిని హత్య చేసిన అనంతరం హరిబాబు పరార్ అయ్యాడు.
నిందితుడిని పట్టుకునేందుకు మూడు టీమ్ లు గాలింపు చేపట్టినట్టు చెప్పారు. ఢిల్లీ, ఆగ్రా, జైపూర్‌లో తనిఖీలు చేసినట్లు పేర్కొన్నారు. హరిబాబు పరార్ అయ్యేందుకు సహకరించిన ములుగు జిల్లాకు చెందిన వట్టే రమణయ్య, రమను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్టు సీఐతెలిపారు.