ఓయూ, వెలుగు: బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ మన్నె క్రిశాంక్‌ను హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) పోలీసులు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. వర్సిటీ హాస్టల్స్ మూసివేతపై సోషల్ మీడియాలో ఫేక్ సర్క్యులర్‌తో దుష్ప్రచారం చేసిన కేసులో అరెస్టు అయిన క్రిశాంక్‌ను నాంపల్లి కోర్టు అనుమతితో పోలీసులు ఒక్కరోజు కస్టడిలోకి తీసుకున్నారు.
క్రిశాంక్‌ను రెండ్రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా, కోర్టు ఒకరోజు మాత్రమే ఇచ్చింది. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి సోమవారం ఉదయం 11 గంటల వరకు క్రిశాంక్ తమ కస్టడీలో ఉంటాడని ఓయూ పోలీసులు తెలిపారు. ఫేక్ సర్క్యులర్ ఏలా తయారు చేశారు.. ఎవరు చేశారు.. ఎక్కడి నుంచి వచ్చింది.. అనే కోణంలో పోలీసులు విచారించనున్నారు.