కేకే రాజీనామాను స్వాగతిస్తున్నం : కేటీఆర్

కేకే రాజీనామాను స్వాగతిస్తున్నం : కేటీఆర్
  • ఎమ్మెల్యేల సంగతేందో రాహుల్ గాంధీ చెప్పాలె

హైదరాబాద్, వెలుగు: రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌‌లో చేరిన ఎమ్మెల్యేల సంగతేంటని, వారితో ఎప్పుడు రాజీనామా చేయిస్తారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌‌గాంధీని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు రాహుల్‌‌గాంధీని కోట్‌‌ చేస్తూ కేటీఆర్ గురువారం ఓ ట్వీట్ చేశారు.

కాంగ్రెస్‌‌ లోక్‌‌సభ మేనిఫెస్టోలో ఫిరాయింపులను నిరోధిస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఎమ్మెల్యేల ఫిరాయింపును ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టడం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుంటే కాంగ్రెస్ హామీలను దేశం ఎలా నమ్ముతుందంటూ ఆయన రాహుల్‌‌ను ప్రశ్నించారు.