
విజయదశమి సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి నిర్వహించిన ఆయుధ పూజలో బీఆర్ఎస్ నాయకుడు క్యామ మల్లేష్ గన్‍తో హల్ చల్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మునిసిపాలిటీ శేరిగూడలో బీఆర్ఎస్ నాయకుడు క్యామ మల్లేష్ విజయదశమి నాడు కుటుంబసభ్యులతో కలిసి విజయదశమి నాడు తన స్వగ్రామంలో ఆయుధ పూజ నిర్వహించారు. ఆయుధ పూజ ముగిసిన అనంతరం ఆయన గన్‌ను ఆకాశం వైపు గురిపెట్టి కాల్పులు జరిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. బుల్లెట్ గురి తప్పితే పరిస్థితి ఏంటన్న విమర్శలు వస్తున్నాయి.