కరీంనగర్ క్రైం, వెలుగు: ఫేక్డాక్యుమెంట్లతో భూ ఆక్రమణకు పాల్పడిన కేసులో బీఆర్ఎస్ నాయకుడు, కరీంనగర్ జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రధాన అనుచరుడు నందెళ్లి మహిపాల్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఫేక్డాక్యుమెంట్లు సృష్టించి, అక్రమంగా 15 గుంటల భూమిని ఆక్రమించి డబుల్ రిజిస్ట్రేషన్ చేశారని బాధితుడు ఎర్రం కనకారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో మహిపాల్తోపాటు చిట్యాల కిష్టమ్మ, గుండ రాజమల్లు, గంగాధర కనకయ్య, నక్క జితేందర్, నక్క పద్మ, తాటిపాముల రాజు, కొత్తకొండ శ్రీను అలియాస్ మైకల్ శ్రీను, చిల్లా శ్రీనివాస్(గతంలో కొత్తపల్లి తహసీల్దార్)పై పలు సెక్షన్ల కింద పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.
ఈ కేసులో ఏ3గా ఉన్న నందెళ్లి మహిపాల్ ను కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. భూకబ్జా ఆరోపణలతో బీఆర్ఎస్ లీడర్లు, కార్పొరేటర్లు, వారి భర్తలపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా ఓ తహసీల్దార్ పైనే కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. ఎర్రం కనకారెడ్డి కేసులో గతంలో కొత్తపల్లి తహసీల్దార్ గా పనిచేసిన చిల్ల శ్రీనివాస్ ను ఏ9 నిందితుడిగా చేర్చారు. ప్రస్తుతం ఆయన సిద్ధిపేట జిల్లా కొండపాక తహసీల్దార్ గా పని చేస్తున్నారు.