ట్యాంక్ ఎక్కి బీఆర్ఎస్ లీడర్ నిరసన

సుల్తానాబాద్, వెలుగు : సుల్తానాబాద్ పట్టణంలోని 909 సర్వే నంబర్ ‌‌ ‌‌లోని భూములను రికార్డుల్లో ప్రైవేట్ ల్యాండ్ ‌‌గా మార్చాలని బీఆర్ఎస్ కౌన్సిలర్ అనుమాల అరుణ భర్త బాపురావు సోమవారం వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. ప్రైవేట్ వ్యక్తుల భూములను.. రిజిస్ట్రేషన్ శాఖ ప్రభుత్వ భూములుగా పేర్కొనడంతో రిజిస్ట్రేషన్లు జరగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బాపురావు చెప్పాడు.

ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయిన పట్టించుకోకపోవడంతో ట్యాంక్ ఎక్కి ఆందోళన చేస్తున్నట్లు చెప్పాడు. మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత, రెవెన్యూ, పోలీసు అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని బాపురావుతో చర్చించడంతో కిందికి దిగి వచ్చాడు.