సింగిల్ విండో డైరెక్టర్ పదవికి బీఆర్ఎస్ లీడర్ రాజీనామా

జగిత్యాల జిల్లా కొడిమ్యాల సింగిల్ విండో డైరెక్టర్ పదవికి నాచుపల్లికి చెందిన సురభి సాగర్ రావు రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఈఓ గంగాధర్ కు అందజేసినట్లు తెలిపారు. ఇందులో ఎవరి ఒత్తిళ్లు లేవని, వ్యక్తిగత కారణాలతోనే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తన పూర్తి అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. సింగిల్ విండో డైరెక్టర్ పదవికి తాను చేసిన రాజీనామాను ఆమోదించగలరని లేఖలో తెలియజేశారు.