హైదరాబాద్: ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు పై అఖిలపక్ష మీటింగ్పెట్టాలని బీఆర్‌ఎస్‌నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్‌చేశారు. తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ మాట్లాడారు.. యంగ్‌ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో ప్రస్తుతం ఉన్న ఎస్సీ,ఎస్టీ, బీసీ గురుకులాలను బంద్ చేయాలనే కుట్ర చేసుందన్నారు. ‘ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న డిప్యూటీ సీఎంకు గురుకుల విద్యా వ్యవస్థపై అవగాహన లేదు. సీఎం, డిప్యూటీ సీఎం ఎప్పుడైనా గురుకులాలకు వెళ్ళారా..? పది లక్షల మంది విద్యార్థులతో ప్రభుత్వం ఆడుకుంటోంది. ఇంటిగ్రేటెడ్ గురుకులాలపై జీవో లేకుండా భట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎట్లా ఇస్తారు. మండలాల్లో ఉన్న గురుకులాలను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కేసీఆర్ ఎంతో శ్రమించి గురుకుల వ్యవస్థను తీసుకువచ్చారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకులాల్లో పని చేస్తున్న టీచర్లను ఒకే రోజు రెండు వేలమందిని తీసేశారు. విద్యార్థులు తమకు ఫ్యాకల్టీ కావాలని డిమాండ్ చేస్తున్నారు’ అని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు.
ALSO READ | హైదరాబాద్‌లో GHMC కమిషనర్ ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు