మానిక్ పఠార్ ఊరును తొలగిస్తే ఊరుకోం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

మానిక్ పఠార్ ఊరును తొలగిస్తే ఊరుకోం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ఆసిఫాబాద్, వెలుగు: టైగర్ జోన్ పేరుతో మానిక్ పఠార్ ఊరును తొలగిస్తే ఊరుకోబోమని బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. ఆదివారం సిర్పూర్ నియోజకవర్గంలోని మానిక్ పఠార్ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ భూములకు పట్టాలిచ్చి, రైతు బంధు, రైతు బీమా పథకాలు ప్రవేశపెట్టి ఆదుకుంటే.. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కనీసం పట్టా భూములకు లోన్ ఇచ్చే పరిస్థితి కూడా లేదని, రుణమాఫీ కూడా చేయడం లేదని విమర్శించారు. 

మానిక్ పఠార్ లో 70 ఏండ్లుగా ప్రజలకు ఇండ్లు, రోడ్డు సౌకర్యం లేదని, కనీస మౌలిక సౌకర్యాలు కల్పించకపోవడం దారుణమన్నారు. ప్రస్తుతం ఆ గ్రామాన్ని టైగర్ రిజర్వ్ ప్రాంతంగా పరిగణిస్తూ తొలగించాలని కుట్ర చేస్తున్నారని, అలా చేయాలని చూస్తే ఊరుకోమన్నారు. ప్రజల కోసం పోరాడుతానన్నారు.