తమిళనాడు తరహాలో ముందుకెళ్దాం! : వినోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌

తమిళనాడు తరహాలో ముందుకెళ్దాం! :  వినోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కుమార్‌

హైదరాబాద్, వెలుగు: నీట్ విషయంలో తమిళనాడు తరహాలో ముందుకు పోవాలని రాష్ట్ర సర్కారు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మాజీ ఎంపీ, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ నేత వినోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  సూచించారు. రాష్ట్రాలవారీగా నీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  నిర్వహించాలని తమిళనాడు కోరుతోందని, మనం కూడా అలాగే డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  చేయాలని ఆయన అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. నీట్ వల్ల మన రాష్ట్ర విద్యార్థులకు లాభమో, నష్టమో తేల్చేందుకు ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కమిటీ వేయాలని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై తాను మెడికల్  ప్రొఫెసర్లతో మాట్లాడానని, నీట్  వల్ల మన స్టూడెంట్లకు నష్టమే అని వాళ్లు చెబుతున్నారని ఆయన వెల్లడించారు. 

ప్రభుత్వ మెడికల్  కాలేజీల్లో 15 శాతం సీట్లను నేషనల్  కోటా కింద భర్తీ చేస్తున్నారని, ఈ కోటా వల్ల మన కాలేజీల్లోని సీట్లు ఇతర రాష్ట్రాల స్టూడెంట్లు పొందుతున్నారని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, సీట్ల కన్నా మన రాష్ట్రంలో ఎక్కువ కాలేజీలు, సీట్లు ఉండడం వల్ల నేషనల్ పూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మనకు నష్టమే ఎక్కువగా జరుగుతోందని వివరించారు. మన విద్యార్థులకు ఇతర రాష్ట్రాల్లోని కాలేజీల్లో సీట్లు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ వారు వెళ్లడం లేదని, లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చదివేందుకు ఇష్టపడుతున్నారని తెలిపారు. ఈ అంశాలన్నింటిపై సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి దృష్టి సారించాలని వినోద్  కోరారు. ఈసారి నీట్  ఎగ్జామ్ పేపర్  రద్దు అయినట్టు స్పష్టంగా తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ పరీక్షను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.