తెలంగాణను అగ్రగామిగా నిలిపాం : వినోద్ కుమార్

కరీంనగర్, వెలుగు: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపామని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్ క్యాంపు ఆఫీస్ వద్ద బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీ నాయకుడు జక్కుల నాగరాజు ఆధ్వర్యంలో న్యూ ఇయర్​వేడుకలు నిర్వహించారు. 

అనంతరం వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటయ్యాక కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి నెర్రెలుబారిన నేలలకు గోదావరి జలాలు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు,  మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, లైబ్రరీ సంస్థ అధ్యక్షుడు పొన్నం అనిల్ గౌడ్ పాల్గొన్నారు.