ప్రశ్నిస్తే అణగదొక్కుతున్నడు .. ఎమ్మెల్యే చందర్‌‌‌‌‌‌‌‌పై బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ అసంతృప్త లీడర్ల ఫైర్‌‌‌‌‌‌‌‌

గోదావరిఖని, వెలుగు: రామగుండం నియోజకవర్గంలో ప్రశ్నిస్తే తమను ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌‌‌‌‌‌‌‌ అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ అసంతృప్త లీడర్లు ఆరోపించారు. గురువారం సింగరేణి జీడీకే 11వ గనిపై కార్మికులతో, అనంతరం గోదావరిఖని ప్రెస్‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌లో జరిగిన మీటింగ్‌‌‌‌‌‌‌‌లలో రామగుండం బీఆర్ఎస్​ టికెట్​ఆశిస్తున్న కందుల సంధ్యారాణి, మిర్యాల రాజిరెడ్డి, కొంకటి లక్ష్మినారాయణ, బయ్యపు మనోహర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, పాతపెల్లి ఎల్లయ్య మాట్లాడారు. 

ప్రజలకు సేవ చేయడానికి తాము టికెట్​అడుగుతున్నామని, జీర్ణించుకోలేని ఎమ్మెల్యే చందర్‌‌‌‌‌‌‌‌ తమను పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదని ఆరోపించారు. లీడర్లు, కార్యకర్తలను బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే అవినీతి వల్ల వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిచే పరిస్థితి లేదని, అందుకే తమ ఐదుగురిలో ఒకరికి టికెట్​ఇవ్వాలని హైకమాండ్‌‌‌‌ను కోరారు. ఈనెల 6న గోదావరిఖని‌‌‌‌లో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించనున్నట్లు అసంతృప్త లీడర్లు ప్రకటించారు.