పాలమూరు, వెలుగు : భవిష్యత్ అంతా కాంగ్రెస్ పార్టీదే అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే సమక్షంలో మహబూబ్ నగర్ మండలం తెలుగు గూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. కార్యక్రమంలో మల్లు నర్సింహ్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, తెలుగు గూడెం ఆంజనేయులు, ఉపసర్పంచ్ ఆంజనేయులు, కుమ్మరి రాములు తదితరులు ఉన్నారు.
రేవల్లి : రేవల్లి మండల పరిధిలోని గౌరీదేవి పల్లి, వడ్డె గెరి చెందిన దాదాపు 100 మంది బీఆర్ఎస్ నాయకులు, మహిళా కార్యకర్తలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం వనపర్తిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వీరికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పర్వతాలు, సత్యశీలా రెడ్డి, సురేశ్‌గౌడ్, సురేందర్, బాల్ రెడ్డి ఉన్నారు.
నాగర్ కర్నూల్ టౌన్ : తాడూరు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యార రమేశ్‌తో పాటు 50 మంది ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్ వల్లబ్ రెడ్డి పాల్గొన్నారు.
వంగూరు : నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి సమక్షంలో వంగూరు మండల బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చౌడంపల్లి పుల్లయ్య యాదవ్, మాజీ ఎంపీటీసీ శ్రీశైలం, నరేందర్ గౌడ్ గురువారం కాంగ్రెస్ లో చేరారు.