ఖానాపూర్ / కడెం, వెలుగు: ఖానాపూర్ నియోజక వర్గ పరిధిలోని జన్నారంలో జరిగిన కేటీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు ఖానాపూర్, పెంబి, కడెం మండలలా నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వెళ్లారు. బీఅర్ఎస్ అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ తరఫున ఎన్నికల ప్రచారానికి వచ్చిన కేటీఆర్ కు స్వాగతం పలికినట్లు తెలిపారు.
జాన్సన్ నాయ క్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ రాజేందర్, ఖలీల్, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు రాజ గంగన్న, పరిమి సురేశ్, నరేందర్ రెడ్డి, చంద్రశేఖర్, నారాయణ, నల్లా శ్రీనివాస్, రాము నాయక్, శ్రావణ్, కిషోర్, రాజేందర్ గౌడ్, కావాలి సంతు,ఇర్ఫాన్, నసీర్, మహరాజ్, తదితరులు ఉన్నారు.