తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాలను బరిలో దించే పనిలో పడ్డాయి. సీఎం కేసీఆర్ ఆగస్టు 21న మధ్యాహ్నం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదల చేయనున్నారు.
ఈ క్రమంలో టిక్కెట్లు రావు అని ప్రచారం జరుగుతున్న పలువురు నేతలు పార్టీ ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఖానాపూర్ఎమ్మెల్యే రేఖ నాయక్, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హైదరాబాద్‌లో ఉన్న మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత నివాసాలకు వెళ్లారు.
తమకు బీఆర్ఎస్ టికెట్ కేటాయించాల్సిందిగా విన్నవిస్తూ.. సీఎం కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మహిళా కమిషన్ ఛైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి సైతం కవిత నివాసానికి వచ్చి టిక్కెట్ల వ్యవహారంపై చర్చించినట్లు సమాచారం. నర్సాపూర్‌కి ప్రస్తుతం మదన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఆ నియోజకవర్గ టిక్కెట్టును సునీతా రెడ్డి ఆశిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎవరికి స్నేహ హస్తం అందిస్తుందో, ఎవరికి మొండి చేయి చూపుతుందో తెలుసుకోవాలంటే మరి కొన్ని క్షణాలు వేచి చూడాల్సిందే.