కరీంనగర్ టౌన్, వెలుగు: అవినీతికి బ్రాండ్ అంబాసిడర్లుగా బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల్లపు రమేశ్ ఆరోపించారు. ఆదివారం గీతాభవన్ హోటల్‌లో మీడియాతో మాట్లాడుతూ అధికారం ఊడగొట్టినా అవినీతి ఆగడం లేదని మండిపడ్డారు.
ప్రైవేట్ సైన్యంతో రూ.కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. నగర పాలక సంస్థను మేయర్ సునీల్ రావు ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలా తయారు చేశారన్నారు. కరీంనగర్‌ను కబ్జాలకు, కరప్షన్లకు కేరాఫ్ గా మార్చారని మండిపడ్డారు. సిటీలో సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే భయపడే దుస్థితి నెలకొందని ఆరోపించారు.
బల్దియాలో జరుగుతున్న అవినీతికి ఆధారాలున్నాయని, వాటిపై ఏసీబీతోపాటు విజిలెన్స్‌కు న్స్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు కొలగాని శ్రీనివాస్, అనూప్, లీడర్లు రమణారెడ్డి, ఎన్నం ప్రకాశ్, రమేశ్, లోకేశ్ పాల్గొన్నారు.