కొడంగల్, వెలుగు: కొడంగల్ నియోజకవర్గంలోని పోలేపల్లి, హకీంపేట్‌లో ఫార్మా విలేజ్ఏర్పాటును వ్యతిరేకిస్తూ పాదయాత్రకు బయలుదేరిన మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫార్మా విలేజ్‌లో భూములు కోల్పోతున్న రైతులకు మద్దతుగా బుధవారం వారు పాదయాత్ర చేపట్టగా, తుంకిమేట్ల వద్ద పోలీసులు అడ్డుకొని ఠాణాకు తరలించారు.రైతులకు నష్టం చేసే ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన పోరాడేందుకు బీఆర్ఎస్ముందు ఉంటుందని చెప్పారు.
స్వచ్ఛందంగా ముందుకొస్తున్న రైతులు
మరోవైపు, పోలేపల్లి, హకీంపేట్పరిధిలోని లగచర్ల, పులిచర్ల, రోటిబండ తండాల రైతులు ఫార్మా కంపెనీకి స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు.122 మంది రైతులు 218 ఎకరాల భూమిని ఇచ్చేందుకు అధికారులకు బుధవారం ఎన్ఓసీ అందజేశారు.