నల్లబెల్లి, వెలుగు: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని గురువారం బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఫ్లెక్సీని కాంగ్రెస్ లీడర్లే చింపేశారంటూ బీఆర్ఎస్ లీడర్లు ఆందోళనకు దిగారు.
ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పార్టీల నాయకుల ఫ్లెక్సీల లొల్లి తీవ్ర స్థాయికి చేరుకుని ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో దుగ్గొండి సీఐ, నల్లబెల్లి ఎస్సై ఇరు వర్గాలను చెదరగొట్టారు.