బీఆర్ఎస్ లీడర్ బర్త్ డే.. క్వార్టర్ మందు, పంది మాంసం పంపిణీ

కరీంనగర్ మాజీ మేయర్, సివిల్ సప్లై కార్పోరేషన్ ఛైర్మన్ రవీందర్ సింగ్ బర్త్ డే సందర్భంగా ఆయన అభిమాని ఒకరు కరీంనగర్ లో మందు, పంది మాంసం పంచారు.  50 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు.  

తెలంగాణ ఎరుకల ప్రజాసమితి రాష్ట్ర అధ్యక్షుడు కేమసారం తిరుపతి ఆధ్వర్యంలో నగరంలోని కోతిరాంపూర్ లో200 మంది ఎరుకలకు పంది మాంసంతో పాటు, క్వార్టర్ మద్యం పంపిణీ చేశారు. తమ కుల సంప్రదాయం ప్రకారం పంది మాంసం, మద్యం పంపిణీ చేసామని తిరుపతి వెల్లడించారు.  

రవీందర్ సింగ్ భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని కోరుతూ కేక్ కట్ చేసి ఆయనకుశుభాకాంక్షలు తెలిపారు  ఎరుకల కులస్థులు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.