మెట్ పల్లి, వెలుగు: కోరుట్ల ఎమ్మెల్ విద్యాసాగర్ రావు, కొడుకు సంజయ్‌లపై నిజామాబాద్ఎంపీ అర్వింద్అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ శనివారం బీఆర్ఎస్ లీడర్లు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో ఎంపీపీ సాయిరెడ్డి మాట్లాడుతూ శుక్రవారం పసుపు రైతుల కృతజ్ఞత సభకు వచ్చిన ఎంపీ.. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.
ఎమ్మెల్యేపై చేసిన తప్పుడు ఆరోపణలకు ఎంపీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, పలు గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.