
నేరడిగొండ/కోల్ బెల్ట్/ జన్నారం, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ బర్త్‌డే వేడుకలను బీఆర్ఎస్ నేతలు ఘనంగా జరిపారు. కేసీఆర్ తెలంగాణ కారణజన్ముడని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నేరడిగొండ మండల కేంద్రంలో కేక్ కట్, చేసి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా.. అనిల్ జాదవ్‌తో పాటు దాదాపు 700 మంది యువకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో బోథ్, నేరడిగొండ మాజీ ఎంపీపీలు తుల శ్రీనివాస్, రాథోడ్ సజన్ తదితరులు పాల్గొన్నారు.
జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్నేతలు కేక్ కట్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ధర్మారంలో మొక్కలు నాటారు. మాజీ జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, బీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ రాజారాంరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి భరత్ కుమార్, జనరల్ సెక్రటరీ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి బొగ్గు గనులపై కేసీఆర్71వ బర్త్‌డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామకృష్ణాపూర్ టౌన్ బీఆర్ఎస్ప్రెసిడెంట్ సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ ఆఫీస్‌లో, మందమర్రిలోని మనోవికాస్ మానసిక దివ్యాంగుల స్కూల్లో వేడుకలు నిర్వహించి పండ్లు పంపిణీ చేశారు.