సిరిసిల్ల కలెక్టర్‌‌‌‌‌‌‌‌పై సీఎస్‌‌‌‌‌‌‌‌కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు

సిరిసిల్ల కలెక్టర్‌‌‌‌‌‌‌‌పై సీఎస్‌‌‌‌‌‌‌‌కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు

రాజన్నసిరిసిల్ల,వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్​ ఝా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ సీఎస్​శాంతకుమారికి బీఆర్ఎస్ నేతలు శాసనమండలి పక్షనేత మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు వివేకానంద, డాక్టర్ సంజయ్​ఫిర్యాదు చేశారు. సిరిసిల్లలో మూడు రోజులు కింద బతుకమ్మ ఘాటు వద్ద ఓ టీకొట్టు నిర్వాహకుడు కేటీఆర్ బొమ్మ పెట్టుకున్నాడనే నెపంతో ఆయన షాపును మూయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై చర్యలు తీసుకోవాలని సీఎస్‌‌‌‌‌‌‌‌ను విజ్ఞప్తి చేశారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో పొట్టకొచ్చిన పంట పొలాలు ఎండిపోతున్నాయని, వెంటనే మల్కపేట రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసి సింగ సముద్రాన్ని నింపి సాగు నీరందించాలని సిరిసిల్ల ఎమ్యెల్యే కేటీఆర్ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డికి లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాశారు.