బీజేపీ ఎంపీ అభ్యర్థి నగేశ్ ​నామినేషన్​ తిరస్కరించండి : దాసోజు శ్రవణ్

  • సీఈఓకు దాసోజు శ్రవణ్​ ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు: బీజేపీ అదిలాబాద్ ఎంపీ అభ్యర్థి నగేశ్​పై బీఆర్​ఎస్​ లీడర్లు సీఈఓ వికాస్​ రాజ్​కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల అఫిడవిట్​లో పూర్తి వివరాలు ఇవ్వలేదని ఆర్వోకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని తెలిపారు.  బీజేపీ అభ్యర్థి నామినేషన్ రిజెక్ట్ చేసి రిటర్నింగ్ అధికారిపై చర్యలు తీసుకోవాలని సీఈఓను కోరినట్లు దాసోజు శ్రవణ్​ మీడియాకు వెల్లడించారు. ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోందని ఆరోపించారు. నామినేషన్ తిరస్కరించడానికి అన్ని ఆధారాలు చూపినా  రిటర్నింగ్ అధికారి స్పందించలేదన్నారు. రాష్ట్రంలో ఎన్నికల అధికారులు సైతం బీజేపీకి సహకరిస్తున్నారని శ్రవణ్ ఆరోపించారు.