- బీఆర్ఎస్ నేతల హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ నేతలు ఖండించారు. ఆమె కేటీఆర్‌కు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు.‘‘రాజకీయంగా ఎదుర్కోలేనప్పుడు, చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వ్యక్తిగత విమర్శలు చేస్తారు” అని ఆయన ట్వీట్ చేశారు.
రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు సరికాదు అని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు.‘‘మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయం. రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదు’’ అని ఆమె ట్వీట్ చేశారు. మంత్రి వ్యాఖ్యలు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. ప్రజలను డైవర్ట్ చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని సత్యవతి రాథోడ్, మాలోతు కవిత, తుల ఉమ మండిపడ్డారు.