
షాద్ నగర్, వెలుగు: బీఆర్ఎస్ నేతలకు సొంత అవసరాలే తప్ప ప్రజా ప్రయోజనాలు పట్టవని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఫైరయ్యారు. గడిచిన పదేండ్లలో గ్రామాల మధ్య మంచి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచలేదని దుయ్యబట్టారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో చేగూరు, బుగ్గోని గూడ, బండోని గూడ, వెంకమ్మ గూడ గ్రామాల్లో రోడ్డు పనుల ప్రారంభోత్సవాలకు గురువారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మద్దూరు వద్ద మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రజల అవసరాలను పట్టించుకోకుండా తన ఫామ్ హౌస్ వరకే రోడ్డును పరిమితం చేశారన్నారు. ప్రజా ప్రభుత్వంలో ఇప్పుడు చేగూరు నుంచి మద్దూరు వరకు రూ.40 లక్షల ఖర్చుతో రోడ్డును నిర్మిస్తున్నట్లు చెప్పారు.