కాళేశ్వరంపై బీఆర్​ఎస్​ నేతలు తప్పుడు ప్రచారం చేశారు

కాళేశ్వరంపై బీఆర్​ఎస్​ నేతలు తప్పుడు ప్రచారం చేశారు


కాళేశ్వరం వల్లే తెలంగాణ వరిసాగు పెరింగిందని బీఆర్​ఎస్​ నాయకులు చేసిన తప్పుడు ప్రచారం పటాపంచలైందని సీఎం రేవంత్​ రెడ్డి ట్వీట్​ చేశారు.  ఈ ఏడాది తెలంగాణాలో వరి సాగు ఎక్కువుగా ఉందంటూ.. సన్న వడ్లకు బోనస్​ కూడా ఇస్తున్నామన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్ట్​ తో సంబంధం లేకుండానే వరిసాగు పెరిగిందన్నారు. మేడిగడ్డ కుంగిపోవడంతో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదని సీఎం రేవంత్​ తెలిపారు.  

ఎన్డీఎస్​ఏ సూచనల మేరకు  అన్నారం... సుందిళ్లలో కూడా నీటిని నిల్వ చేయలేదన్నారు.  కాళేశ్వరంతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తరువాత తొలిసారి రికార్డు స్థాయిలో వరిధాన్యం పండిందన్నారు. 

Also Read : లగచర్ల దాడి ప్రధాన నిందితుడు సురేష్ ఎక్కడ..

తెలంగాణ రైతులు వరిధాన్యాన్ని అధికంగా పండించి ఎంతో ఘనత సాధించారని సీఎం రేవంత్​ రైతులను కొనియాడారు.  వారి శ్రమకు తగిన ఫలితాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు.  కాంగ్రెస్​ ప్రభుత్వంలో తెలంగాణ రైతు.. దేశానికే గర్వకారణమయ్యాడంటూ... ఈ ఘనత సాధించిన రైతుసోదరులను సీఎం రేవంత్​రెడ్డి అభినందించారు.