రేవంత్ రెడ్డిపై పోలీసులకు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ నేతల ఫిర్యాదు

రేవంత్ రెడ్డిపై పోలీసులకు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ నేతల ఫిర్యాదు
  • కేసీఆర్‌‌‌‌‌‌‌‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కంప్లైట్‌‌‌‌

జూబ్లీహిల్స్/జీడిమెట్ల, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌పై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పలువురు బీఆర్ఎస్ నేతలు పోలీసు స్టేషన్‌‌‌‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్​నేతృత్వంలోని బృందం శుక్రవారం ఫిల్మ్‌‌‌‌నగర్ పోలీసు స్టేషన్‌‌‌‌లో రేవంత్‌‌‌‌పై ఫిర్యాదు చేసింది. దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. నోరు తెరిస్తే బూతులు మాట్లాడే ఏకైక సీఎం రేవంత్​రెడ్డేనని మండిపడ్డారు. తెలంగాణ తొలి సీఎం అయిన కేసీఆర్​పై రేవంత్‌‌‌‌ అభ్యంతకరమైన భాష వాడుతున్నారని తెలిపారు. దీనిపై డీజీపీ చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. 

అలాగే, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్సీ శంభీపూర్‌‌‌‌‌‌‌‌ రాజు, ఎమ్మెల్యేలు రాజశేఖర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, వివేకానంద్‌‌‌‌‌‌‌‌ కూడా పేట్‌‌‌‌ బషీరాబాద్‌‌‌‌ పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌లో సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఈ నెల 12న రవీంద్ర భారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో రేవంత్‌‌‌‌ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను ఉద్దేశించి స్టేచర్ నుంచి స్ట్రెచర్‌‌‌‌‌‌‌‌కు వెళ్లారని, అలాగే స్ట్రెచర్ నుంచి మార్చురీకి వెళ్తారన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం వ్యాఖ్యలు రాజకీయ పార్టీల మధ్య హింస చెలరేగేలా ఉన్నాయన్నారు. రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.