బూతులు తిట్టుకున్న బీఆర్ఎస్​ నేతలు

బూతులు తిట్టుకున్న బీఆర్ఎస్​ నేతలు
  • బూతులు తిట్టుకున్న బీఆర్ఎస్​ నేతలు
  • నాగర్ కర్నూల్  జిల్లా వెల్దండ మండలంలో ఘటన

వెల్దండ(నాగర్ కర్నూల్), వెలుగు : ఎన్నికల ముందు అధికార బీఆర్ఎస్​లో లుకలుకలు బయటపడుతున్నాయి. బుధవారం వెల్దండ మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్​ కార్యకర్తల సమ్మేళనంలో వెల్దండ సర్పంచ్, మండల పార్టీ అధ్యక్షుడు యెన్నం భూపతిరెడ్డి, మాజీ వైస్​ఎంపీపీ వెంకటయ్య గౌడ్​ మధ్య మాటమాట పెరిగి ఎమ్మెల్యే జైపాల్​ యాదవ్​ సమక్షంలో బూతులు తిట్టుకున్నారు.ఈ టైంలో గొడవపడడం సరికాదని ఎమ్మెల్యే ఇద్దరికీ సర్ది చెప్పారు. 

మాజీ వైస్​ఎంపీపీ వెంకటయ్య గౌడ్ మాట్లాడుతూ..​ పార్టీలో కార్యకర్తలకు గుర్తింపు, గౌరవం లేదన్నారు. దీనిపై స్పందించిన మండల పార్టీ అధ్యక్షుడు భూపతిరెడ్డి..  జైలుకు వెళ్లివచ్చిన వాళ్లు, ప్రభుత్వ స్కీములు రానివారు ప్రతిదానికి ఎమ్మెల్యేను బాధ్యుడిని చేయడం కరెక్టు​కాదన్నారు. తీవ్ర ఆగ్రహానికి గురైన వెంకటయ్య.. ‘‘గతంలో నీవు కూడా జైలుకు వెళ్లినవాడివే కదా?’’ అని ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఎమ్మెల్యే అసహనానికి గురయ్యారు. తాను అందరికీ అందుబాటులో ఉండే ఎమ్మెల్యేనని, ఇప్పుడు విమర్శలు చేయడం సరికాదన్నారు