
తెలంగాణలో ఎన్నికల హీట్ మొదలైంది. పార్టీలు హోరాహోరీ ప్రచారం చేస్తున్నాయి. పబ్లిక్ మీటింగ్ లతో స్పీడ్ పెంచాయి. ఇక అధికార పార్టీ ప్రలోభాలకు పాల్పడుతోంది. సీఎం కేసీఆర్ మీటింగ్ కు వచ్చే వారికి బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో ఆఫర్లు ప్రకటించారు.మీటింగ్ కు హాజరయ్యే ఒక్కొక్కరికి రూ. 250 రూపాయలు ఇస్తామని వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం దౌలత్ నగర్, బాజు తండా బీఆర్ఎస్ పార్టీ ఇన్ చార్జ్ పేరుతో వాట్సప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు.
దీంతో దౌలత్ నగర్ కు చెందిన ఇతర పార్టీ నాయకులు స్క్రీన్ షాట్ తీసి, గ్రూప్ అడ్మిన్ స్క్రీన్ షాట్ , ఇన్ చార్జి ఫోటోతో కూడిన పోస్టింగ్ ను వర్దన్న పేట ఎలక్షన్ స్పెషల్ స్క్వాడ్ ఆఫీసర్లకు కంప్లైంట్ ఇచ్చారు. రంగంలోకి దిగిన ఆఫీసర్లు దీనిపై ఎంక్వయిరీ చేశారు. కేసు నమోదు చేసి ఆధారాలతో సహా పర్వతగిరి పోలీసులకు ఇచ్చినట్లు స్పెషల్ స్క్వాడ్ ఆఫీసర్ సురేష్ తెలిపారు. ఫిర్యాదు వచ్చినట్లు పోలీసులు ధృవీకరించారు.