కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కొత్తగా పోటీ చేయాలనుకునే BRS నేతలు కన్ఫ్యూ జ్ అవుతున్నారట. కేసీఆర్ ను నమ్ముకోవాలో..కేటీఆర్ ను నమ్ముకోవాలో తెలియక తికమక పడుతున్నారట. ఇద్దరిలో బెటర్ ఆప్షన్ ఏంటనేదానిపై లెక్కలు కడుతున్నారట. ఎవరితోనైనా రికమండేషన్ చేయిద్దామన్నా..ఎవరికి చెప్పించాలనే దానిపై క్లారిటీ దొరక్క కన్ ఫ్యూజన్ లో పడిపోతున్నారట గులాబీ లీడర్లు.
పార్టీలో ప్రస్తుతం కేటీఆర్ ని నమ్ముకొని చాలామంది టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కొన్ని నియోజవర్గాల్లో సిట్టింగ్ లపై పోటీకి సై అంటున్నారు. అంతా కేటీఆర్ చూసుకుంటారన్న ధైర్యంతో పోటీకి రెడీ అవుతున్నారట. ఎమ్మెల్యేలకు పోటీగా ఖర్చు చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ సిట్టింగ్ లకు సవాళ్లు విసురుతున్నారు. ఇంకొంతమంది కేసీఆర్ ఉన్నారనే ధైర్యంతో టికెట్ ప్రయత్నాలు చేసుకుంటున్నారట.
2018 ఎన్నికలతో పోలిస్తే పార్టీలో KTR ప్రాధాన్యత పెరిగింది. ఇతర రాష్ట్రాల్లో BRS బలోపేతంపై KCR ఫోకస్ పెట్టారని, రాష్ట్రంలో పార్టీపై KTR పట్టు పెరిగిందన్న చర్చ గులాబీ లీడర్లల్లో నడుస్తోంది. ఈసారి టికెట్ల కేటాయింపుల్లోనూ KTR హవా ఉంటుందన్న ముచ్చట పార్టీ నేతల్లో వినపడుతోంది. టికెట్లు KCR డిసైడ్ చేస్తారా..? కేసీఆర్ కు తెలియకుండా KTR టికెట్లు ఇస్తారా..? KTR చెప్పిన వాళ్లకు KCR టికెట్లు ఇస్తారా..? అనే చర్చల్లో పార్టీ నేతలు మునిగిపోయారట. 2018 ఎన్నికల్లో కేటీఆర్ ను నమ్ముకున్నోళ్లకు టికెట్ రాకపోవడంతో..ఈసారి ఏం చేద్దామనే డైలమాలో ఉన్నారట కొందరు లీడర్లు.
2018 ఎన్నికల్లో ఒక యాదవ నేత..యూపీలో అఖిలేష్ యాదవ్ ను కలిశారట. తనకు టికెట్ ఇచ్చేలా BRS నేతలకు చెప్పాలని సూచించారట. కేసిఆర్ కు చెప్పాలా కేటీఆర్ కు చెప్పాలా అని అఖిలేష్ అడిగితే.. కేటీఆర్ కి చెప్తే చాలన్నారట. సీన్ కట్ చేస్తే 2018 ఎన్నికల్లో ఆ యాదవ నేతకు టికెట్ దక్కలేదు. కేటీఆర్ కు కాకుండా కేసీఆర్ కు అఖిలేష్ తో చెప్పిస్తే...తనకు టికెట్ తప్పక వచ్చేదని తెగ బాధపడ్డారట ఆ లీడర్.