కొనసాగుతున్న రాజీనామాల పర్వం

వనపర్తి, వెలుగు: వనపర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్  నాయకులు, కార్యకర్తలు, గ్రామ అధ్యక్షుల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి  నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 60 మంది బీఆర్ఎస్  నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మేఘారెడ్డి  మాట్లాడుతూ తొమ్మిదేళ్లుగా బీఆర్ఎస్  పార్టీలో కొనసాగుతున్నా గుర్తింపు లేదన్నారు. ఆత్మగౌరవంతో బతికే తాము ఇకపై బీఆర్ఎస్ లో  కొనసాగలేమని భావించి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఎంపీపీ మేఘారెడ్డి తో కలిసి పనిచేస్తామని చెప్పారు. వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి, సాయి చరణ్ రెడ్డి, ఐ.సత్యారెడ్డి, కౌన్సిలర్లు రాధాకృష్ణ, బ్రహ్మం, వెంకటేశ్, సతీశ్,  మాజీ జడ్పీటీసీ రమేశ్ గౌడ్, వైస్  ఎంపీపీ రఘు, రామచంద్రయ్య గౌడ్, ఎంపీటీసీ దామోదర్, సర్పంచ్  రాధాకృష్ణ, తిరుపతిరెడ్డి, బాలరాజు పాల్గొన్నారు.