వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు

వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నాయకులు

రాయపర్తి, వెలుగు : వరంగల్​ జిల్లా రాయపర్తి మండలంలోని బీఆర్ఎస్​నాయకులు సోమవారం కాంగ్రెస్​పార్టీలో చేరారు. హైదరాబాద్​ గాంధీభవన్​లో టీపీసీసీ వర్కింగ్​ప్రెసిడెంట్​అజారుద్దీన్, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, నియోజకవర్గ ఇన్ చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డి సమక్షంలో బీఆర్​ఎస్​జిల్లా నాయకులు బిల్లా సుధీర్​రెడ్డి, మాజీ రైతు బంధు అధ్యక్షుడు ఆకుల సురేందర్​రావు, మాజీ ఎంపీటీసీ కుంట వినోద ప్రభాకర్, మాజీ సర్పంచ్​ చెవ్వు కాశీనాథంతోపాటు పలువురు నాయకులు కాంగ్రెస్​ కండువాలు కప్పుకున్నారు. 

కాంగ్రెస్​ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో బ్లాక్​ కాంగ్రెస్​అధ్యక్షుడు జాటోతు ఆమ్యానాయక్, పార్టీ మండలాధ్యక్షుడు ఈదులకంటి రవీందర్​రెడ్డి, వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్​కమిటీ వైస్​ చైర్మన్​ సరికొండ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.