కోటగిరి, వెలుగు: బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి సమక్షం లో శుక్రవారం కోటగిరి ఎంపీపీ వల్లేపల్లి సునీత దంపతులు, ఇద్దరు ఎంపీటీసీలు, ఏఎంసీ వైస్ చైర్మన్, సొసైటీ డైరెక్టర్ సహా కొందరు బీఆర్ఎస్ లీడర్లు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంపీ ఎలక్షన్లో బాన్సువాడ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థికి భారీ మెజార్టీ ఇచ్చేందుకు అందరినీ కలుపుకొని పోతామన్నారు. కొత్తవారు పార్టీలోకి వచ్చినంత మాత్రాన పాతవారి కి ప్రాధాన్యత తగ్గదని పేర్కొన్నారు. కార్యక్రమంలో కోటగిరి, పొతంగల్ మండలాల పార్టీ అధ్యక్షులు షాహిద్, పుప్పాల శంకర్, డీసీసీ ఉపాధ్యక్షుడు గంగాధర్ దేశాయ్, కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు ఇందూరు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
లింగంపేట: ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాందారి, ఎమ్మెల్యే మదన్ సమక్షంలో పార్టీలో చేరుతున్న లీడర్లు ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ లీడర్లు శుక్రవారం ఎమ్మెల్యే మదన్మోహన్ రావు సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. లో చేరిన వారిలో ఎల్లారెడ్డి మండలం లోని వెల్లుట్ల, రేపల్లె వాడ, బ్రహ్మణపల్లి, మల్కపల్లి, స్థబ్దలూర్ అల్మాజీపూర్ తాజా మాజీ సర్పంచు లు గుంట రాజేశ్వరీ, సాయిరాం లక్ష్మీ, ఎల్లయ్య, రవీందర్.నారాయణ, మాదవి తదితరులు ఉన్నారు.