గంగాధర/ చొప్పదండి, వెలుగు : చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర, రామడుగు, చొప్పదండి మండలాలకు చెందిన బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్‌లో పీసీసీ చీఫ్రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. గంగాధర జడ్పీటీసీ అనురాధ, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ నర్సయ్య, బీఆర్ఎస్ టికెట్ఆశించిన బండపల్లి యాదగిరి, లీడర్లు విద్యాసాగర్‌రెడ్డి, గంగాధర శంకర్, కనుకయ్య, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు పుల్కం గంగన్న
ప్యాక్స్వైస్ చైర్మన్ వేముల భాస్కర్, ఏఎంసీ డైరెక్టర్లు కల్యాణ్, చందు, నర్సింహులపల్లి, ముప్పిడిపల్లి సర్పంచులు కవిత- మల్లారెడ్డి, మల్లవ్వ- రాజిరెడ్డి, లీడర్లు నర్సింగరావు, హన్మంతు, మరో వంద మంది నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. చొప్పదండి మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజ భర్త, మాజీ ఎంపీపీ గుర్రం భూమారెడ్డి, ప్యాక్స్వైస్ చైర్మన్ మల్లేశం, మరికొందరు కాంగ్రెస్‌లో చేరేందుకు హైదరాబాద్ వెళ్లినప్పటికీ బీఆర్ఎస్ లీడర్ల ఒత్తిడితో జాయిన్ కానట్లు తెలిసింది. కాగా మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజ బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనగా, ఆమె భర్త భూమారెడ్డి మాత్రం హైదరాబాద్వెళ్లడం స్థానికంగా చర్చకు దారితీసింది.
కేసీఆర్, కేటీఆర్ ఇంట్లో కూసోవడం ఖాయం
తంగళ్లపల్లి, వెలుగు : ఎన్నికల తరువాత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇంట్లో కూసోవడం ఖాయమని సిరిసిల్ల కాంగ్రెస్అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం బీఆర్ఎస్, బీఎస్పీ నుంచి పలువురు కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో చేరిన వారిలో సిరిసిల్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లింగం రాణితోపాటు పలువురు బీఆర్ఎస్, బీఎస్పీ నాయకులు ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ప్రవీణ్, భూపతి, శ్రీనివాస్, లక్ష్మీరాజం పాల్గొన్నారు.