సిరికొండ, వెలుగు: మండలంలోని పిసరగుట్ట తండాకు చెందిన పలువురు బీఆర్‌ఎస్ లీడర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తిరుపతి నాయక్, లక్ష్మణ్, హరినాయక్, మహిపాల్, నౌసిలాల్, గణేశ్, మోహన్, భాస్కర్ నాయక్, రాజేశ్వర్‌కు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. తండాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యేను కోరారు.