కోల్‌బెల్ట్, వెలుగు : క్యాతనపల్లి మున్సిపాలిటీకి చెందిన పలువురు బీఆర్ఎస్ లీడర్లు చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్యాతనపల్లి మున్సిపల్ 15 వార్డు బీఆర్ఎస్ఇన్చార్జి అర్నె సతీశ్, మేకల రమేశ్ యాదవ్, మోటిక రవికుమార్‌కు ఎమ్మెల్యే, ఆయన తనయుడు కాంగ్రెస్యువనేత గడ్డం వంశీకృష్ణ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అంతకు ముందు రెండో వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్క్యాంపులో ఉన్న క్యాతనపల్లి మున్సిపల్చైర్పర్సన్జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, కౌన్సిలర్లు ఉదయం ఎమ్మెల్యే వివేక్‌తోపాటు, యువ నేత వంశీకృష్ణను కలిశారు.