ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సమక్షంలో కాంగ్రెస్​లో చేరికలు

కారేపల్లి, వెలుగు : మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సమక్షంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైరాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ ఎస్ నాయకులు డేగల ఉపేందర్,​ కల్తి అరుణ్, బద్దులాల్, సోమ్లా నాయక్ కు కండువా కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే ఆహ్వానించారు.

కార్యక్రమంలో కారేపల్లి సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, జిల్లా నాయకులు బానోత్ రామ్మూర్తి, పాటి నర్సయ్య, హీరాలాల్ తదితరులు పాల్గొన్నారు.