జైపూర్, వెలుగు: జైపూర్ మండలంలోని టేకుమట్ల, ముదిగుంట, బెజ్జాల గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, లీడర్లు, యువకులు పెద్ద సంఖ్యలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిలో మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ, మాజీ సర్పంచులు అంజన్ గౌడ్, శంకర్ గౌడ్ ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కృషి చేస్తామన్నారు.
జన్నారం, వెలుగు: జన్నారం మండలంలోని సోనాపూర్, బంగారు తండాలకు చెందిన 80 మంది బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు కాంగ్రెస్పార్టీలో చేరారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సమక్షంలో సోమవారం వీరంతా మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముజాఫర్ ఆలీఖాన్ ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు.