జనగామ, వెలుగు: స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెంటే అంటూ అనుచరులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌లో చేరుతున్నారు. గురువారం కడియం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో పలువురును నేతలు కండువా కప్పుకున్నారు.
చేరిన వారిలో లింగాల ఘన్పూర్, రఘునాథపల్లి, జఫర్ఘడ్, ధర్మసాగర్ మండలాల జడ్పీటీసీలు గుడి వంశీ , బొల్లం అజయ్, ఇల్లందుల బేబీ, పిట్టల శ్రీలత సత్యనారాయణ, వేలేరు, చిల్పూరు, ఘన్పూర్, జఫర్ఘడ్ ఎంపీపీలు సమ్మిరెడ్డి, సరితా బాలరాజు, రేఖా గట్టయ్య, సుదర్శన్, మాజీ మార్కెట్‌కమిటీ చైర్మన్లు, మాజీ పీఏసీఎస్చైర్మన్లు, మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారు.