
- పలువురు తాజామాజీ సర్పంచ్ లు సైతం
నిజాంపేట, వెలుగు: నిజాంపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. బుధవారం నిజాంపేట ఎంపీపీ సిద్దిరాములు తో పాటు పలు గ్రామాల తాజా మాజీ సర్పంచ్ లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో నార్లాపూర్ మాజీ సర్పంచ్ అమరసేనా రెడ్డి, చల్మెడ మాజీ సర్పంచ్ నర్సింహ్మ రెడ్డి, రజాక్ పల్లి సర్పంచ్ భర్త నాగరాజు, తిప్పన్నగుల్ల సర్పంచ్ భర్త యాదగిరి తదితరులు ఉన్నారు.