మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్​లో చేరిక

నల్గొండ అర్బన్, వెలుగు : వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు వరుసగా కాంగ్రెస్​లో చేరుతున్నారు. నల్లగొండ మండలం చెన్నుగూడెం, దమ్మన్నగూడెం గ్రామంలో బీఆర్ఎస్ కు చెందిన 20 కుటుంబాలు మంగళవారం క్యాంపు కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. పార్టీలో చేరినవారికి మంత్రి కండువాలకు కప్పి ఆహ్వానించారు.

 కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, కాంగ్రెస్​పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, ఎంపీటీసీ తాజాయుద్దీన్, నాయకులు మర్రి సైదులు, సతీశ్, పుట్ట రాకేశ్, కొండల్, శ్రీను, దుబ్బాక ప్రవీణ్, కిషన్, శంకర్, ఈర్ల స్వామి, ఆరెళ్ల సైదులు, నక్క నరసింహ, ఈర్ల నరేశ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.