
మెట్‌పల్లి, వెలుగు: ప్రత్యేక రాష్ట్రసాధన ఉద్యమంలో జర్నలిస్టులు చేసిన కృషి చిరస్మరణీయమని బీఆర్‌ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట సంజయ్ అన్నారు. హనుమకొండ జిల్లాలో నిర్వహించనున్న పార్టీ ఆవిర్భావ సభ సన్నాహాక సమావేశం గురువారం మెట్‌పల్లిలో నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 25 ఏళ్లుగా మీడియా ప్రతినిధులు ప్రత్యేక ఉద్యమంలో, ప్రజాసమస్యలపై నిత్యం పోరాటాలు చేస్తున్నారన్నారు. అనంతరం ఎల్కతుర్తిలో 27న జరగబోయే పార్టీ ఆవిర్భావ సభకు హాజరుకావాలని ఆహ్వాన పత్రికలు అందజేశారు. మాజీ ఎంపీపీ సాయిరెడ్డి, లీడర్లు పాల్గొన్నారు.