మద్నూర్, వెలుగు: జుక్కల్ నియోజకవర్గం పరిధిలోని కందర్ పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పెద్ద కొడప్గల్లో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ జుక్కల్ నియోజకవర్గ ఇన్చార్జి సౌదాగర్ గంగారం వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో గంగారం, మల్లేశ్, శివరాం, లక్ష్మణ్, జె.అనిల్, ఫరీద్, ఫెరోజ్తదితరులు ఉన్నారు.
కార్యక్రమంలో నియోజకరవ్గ ప్రచార కమిటీ అధ్యక్షుడు అరవింద్, ఉపాధ్యక్షుడు రవి, లీడర్లు అజ్జు, సుభాష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.