చారాణ కోడికి బారాణ మసాలా ఎందుకు :కేటీఆర్

చారాణ కోడికి బారాణ మసాలా ఎందుకు :కేటీఆర్
  • రుణమాఫీ సంబురాలపై కేటీఆర్ సెటైర్

హైదరాబాద్, వెలుగు: రుణమాఫీపై ప్రభుత్వం చేస్తున్న సంబురాలు చూస్తుంటే చారణ కోడికి బారాణ మసాల అనే సామెత గుర్తుకొస్తున్నదని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. రుణమాఫీ అయిన రైతులకన్నా, రుణమాఫీకి నోచుకోక కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు.

 ప్రభుత్వం పెట్టిన నిబంధనలతో అన్ని అర్హతలు ఉన్నవారికి కూడా రుణమాఫీ కాలేదని, వారు తమ బాధ చెప్పుకుందామంటే వినేవారే లేరని కేటీఆర్ తెలిపారు. వాళ్లంతా బాధపడుతుంటే, ఎందుకీ సంబురాలు అని  ప్రశ్నించారు. జూన్‌‌‌‌‌‌‌‌లో వేయాల్సిన రైతుభరోసా జూలై వచ్చినా రైతుల ఖాతాలో ఎందుకు వేయలేదని రాష్ట్ర సర్కారును కేటీఆర్ నిలదీశారు.