కేసీఆర్​ను కలిసిన బీఆర్ఎస్ నేతలు

ములుగు, వెలుగు: సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని  మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఆయనను శుక్రవారం పలువురు బీఆర్ఎస్ నేతలు కలిశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు హరీశ్​రావు, పాడి కౌశిక్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్​, పట్లోళ్ల కార్తీక్​రెడ్డి కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్​ఫార్ములా రేసింగ్​కేసు, ఏసీబీ విచారణ, తాజా పరిణామాలపై కేసీఆర్​తో చర్చించారు. గురువారం ఉదయం ఏసీబీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్​హాజరైన విషయం అందరికి తెలిసిందే. అనంతరం పార్టీ వ్యవహారాలు, స్థానిక ఎన్నికలపై కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.