ఇల్లందు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఇల్లందు నియోజకవర్గంలో బీఆర్ఎస్ టికెట్ మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కు ఇవ్వడంతో ఆమె వ్యతిరేక వర్గం మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో సమావేశమైంది. ఈ సమావేశంలో బయ్యారం, గార్ల, ఇల్లెందు. టేకులపల్లి, కామేపల్లి మండలాలకు చెందిన 200 మందికి పైగా బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ALSO READ : మా కాలనీల్లోకి రావద్దు.. ఖమ్మంలో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు
ఇల్లందు నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిని మార్చాలని అసమ్మతి వర్గం నేతలు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ భర్త హరిసింగ్ ఒంటెద్దు పోకడలను అసమ్మతి నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ను మార్చకపోతే రాబోయే ఎన్నికల్లో ఆమె తరపున ప్రచారం చేయబోమని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ వద్దు అంటూ గార్ల, బయ్యారం సొసైటీ చైర్మన్లు మూల మధుకర్ రెడ్డి, దుర్గ,ఇల్లెందు మున్సిపాల్ ఛైర్మన్ డివి, డైరెక్టర్లు , పలువురు సర్పంచులు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కు టికెట్ ఇవ్వొద్దని..లేదంటే తామే ఓ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని అధిష్టానానికి సూచించారు.