ఎంపీ నామా ఇంట్లో బీఆర్ఎస్ నేతల భేటీ

  •    వచ్చే ఎన్నికల్లో కలిసి పని చేయాలని చర్చ

ఖమ్మం, వెలుగు : ఖమ్మంలోని ఎంపీ నామా నాగేశ్వరరావు నివాసంలో బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు.  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,  జిల్లా పార్టీ  అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుతో కలసి  వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, పార్టీ అభ్యర్థి మదన్ లాల్ ఈ భేటీలో పాల్గొన్నారు.  వైరా నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జిగా ఉన్న ఎంపీ నామా నాగేశ్వరరావు, రాములు నాయక్, మదన్ లాల్ మధ్య విభేదాల నేపథ్యంలో సమన్వయం కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.  

దీంతో పాటు రానున్న ఎన్నికలకు సంబంధించి  ప్రత్యేక  సమాలోచనలు జరిపారు.  ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని సీట్లు గెల్చుకునేందుకు అంతా పట్టుదలతో  కలిసి పని చేయాలని ఈ సందర్భంగా  నామా నాగేశ్వరరావు వారికి దిశానిర్దేశం చేశారు.  ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను గడపగడపకు తీసుకెళ్లాలని సూచించారు.