
- కార్యకర్తలతో కిటకిటలాడిన కేసీఆర్ ఫామ్ హౌస్
ములుగు, వెలుగు: ఉగాది పండుగ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కు తరలివచ్చారు. కేసీఆర్ కు ఉగాది శుభాకాంక్షలు చెప్పడానికి వారు పోటీపడ్డారు. జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక తదితర ప్రాంతాల నుంచి కార్యకర్తలు తరలిరావడంతో ఫామ్ హౌస్ కిటకిటలాడింది. కేసీఆర్ కార్యకర్తలను కలుస్తూ వారి క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. లీడర్లతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఎమ్మెల్యేలు హరీశ్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, జహంగీర్, జుబేర్ పాషా, అంజన్ గౌడ్, అర్జున్ గౌడ్, కొన్యాల బాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.